ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ప్రలోభ పెట్టాలని చూశారంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తాజాగా సంచలనానికి తెరదీశారు. విజయ్ అనే వ్యక్తి తనను ప్రలోభ పెట్టాలని చూశారని వెల్లడించారు. తాను డబ్బుకు లొంగే వ్యక్తిని కాదని ఫోన్ కట్ చేశానని తెలిపారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒకరి సానుభూతితో అధికారంలోకి రాదలుచుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ టికెట్ ఎవరికీ ఇచ్చినా సంతోషంగా పని చేస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ వెల్లడించారు. అయితే నిజంగానే ఆర్ధర్ను ఎవరైనా ప్రలోభ పెట్టాలని చూశారా? లేదంటే ఆయనే రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది.