ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో సుంకాలు, పన్ను స్లాబుల్లో కొన్ని మార్పులు చేశారు. వాటి ప్రకారం ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు, ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ప్లాటినం, ఇమిటేషన్ ఆభరణాల ధరలు పెరగనున్నాయి.