కుష్టిరోగి అయిన కౌశికుడ్ని తన భుజాలపైకి ఎక్కించుకుని వేశ్య దగ్గరకు తీసుకెళ్లిన భార్య కథ సతీ సుమతి గురించి పురాణాల్లో చదువుకున్నాం. ఈ కాలంలో సాంప్రదాయిక పద్దతులు, పురాతన ఆచారాలను అనుసరించే మహిళలు ఉంటారా? అంటే చెప్పలేం. మహిళలు దేన్నైనా క్షమిస్తారు కానీ, భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే మాత్రం తట్టుకోలేరు. కానీ, అచ్చం మన పురాణాల్లోని సతీ సుమతి మాదిరిగానే ఓ మహిళ.. తన భర్తను వేరే మహిళలతో గడిపి రమ్మని సంతోషంగా పంపుతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే ఆయన సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని సమాధానం చెబుతోంది.
అమెరికాకు చెందిన మోనికా హల్డట్ అనే మహిళ తన భర్త సంతోషమే తనకు లక్ష్యమని చెబుతోంది. భర్తకు ఎలాంటి అవసరాలు ఉన్నా వాటిని తీర్చి ఆయనను సంతోషపెట్టడానికి ప్రతి భార్య ప్రయత్నించాలని అంటోంది. న్యూయార్క్ పోస్ట్‌తో మోనిక మాట్లాడుతూ.. తన భర్త జాన్‌ను సంతోషపెట్టడమే భార్యగా తన ప్రాథమిక లక్ష్యం అని ఆమె పేర్కొంది. అంతేకాదు, ఇతర మహిళలతో గడపటానికి భర్త అనుమతించడం వల్ల తమ మధ్య అనుబంధం మరింత బలపడటానికి ఉపయోగపడుతుందని తాను నమ్ముతున్నానని కూడా ఆమె చెప్పడం గమనార్హం.
భర్త జాన్‌కు అవసరమైన సమకూర్చడానికి గృహిణిగా పని చేస్తూనే ఇంట్లోని ప్రతి విషయాన్ని తానే చూసుకుంటానని అంటోంది. వంట పని, ఇంటిని శుభ్రం చేసుకునే సమయంలో ఆయన వల్ల ఎటువంటి ఆటంకం కలగకుండా ఇతర మహిళలతో గడపడానికి దూరంగా పంపుతానని చెబుతోంది. పని మధ్యలో భర్త కోసం ఖాళీ సమయం దొరకడం కష్టమని భావించినందున తాను ఇలా చేయడం ప్రారంభించానని ఆమె వెల్లడించారు. తాను అన్ని పనులను పూర్తి చేసిన సమయానికి మాత్రమే జాన్ ఇంటికి తిరిగి వస్తాడని హల్డ్‌ట్ తెలిపింది.
ఇంకా, తాను రోజూ ఎలాంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుందో ఆయనే చెబుతారని, అతనికి నచ్చినట్టు ఉండటంలో తప్పులేదని వ్యాఖ్యానించింది. ‘నేను సెక్సీ-స్పోర్టీగా ఇంట్లో చక్కగా దుస్తులు ధరించడాన్ని జాన్ ఇష్టపడతాడు.. నేను ఇంటిలో మేకప్ వేసుకోవడం అతనికి అస్సలు నచ్చదు.. కొంతమంది మహిళలకు ఏమి చేయాలో లేదా ఎలాంటి వస్త్రాలు ధరించాలని చెప్పడానికి భర్తలు ఇష్టపడకపోవచ్చు, కానీ నా భర్త అటువంటి సూచనలను ఇచ్చినప్పుడు పాటిస్తాను.. ఆయనకు నచ్చినట్టు వస్త్రధారణ చేసుకుంటే సంతోషాన్ని కలిగిస్తుంది.. అది నన్ను సంతోషపరుస్తుంది’ అని ఆ మహిళ చెప్పడం కొసమెరుపు. అదనంగా, హల్ట్ తనను తాను కాపాడుకోవడంలో ఆసక్తిని కలిగి ఉంది, ఎందుకంటే భర్తలు అగ్లీ మరియు లావుగా ఉన్న స్త్రీలను ఇష్టపడరని ఆమె నమ్ముతుంది.