కొచ్చి విమానాశ్రయంలో మూడు సందర్భాల్లో కస్టమ్స్ విభాగం రూ.48,85,562 విలువైన 951.65 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అధికారులు చేసిన ప్రొఫైలింగ్ ఆధారంగా, J9-405 విమానంలో కువైట్ నుండి కొచ్చికి వస్తున్న గ్రీన్ ఛానల్ ద్వారా ఒక ప్రయాణికుడిని అడ్డగించారు. సదరు ప్రయాణికుడిని పరిశీలించగా, శరీరంలో ధరించి దాచి ఉంచిన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 700.85 గ్రాముల ఐదు ముడి బంగారు గొలుసులు, రెండు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నారు.సదరు ప్రయాణికుడిని పరిశీలించగా, జ్యూస్ బాటిల్లోపల, ప్రయాణికుడి నోటిలోపల చాకచక్యంగా దాచి ఉంచిన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 125.45 గ్రాముల బరువున్న మూడు బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని కాసర్గోడ్ జిల్లాకు చెందిన అబ్దుల్లాగా గుర్తించారు.