ఏపీ లోని యూనివర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల కాలపరిమితిని ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఆచార్య నాగార్జున, ఆదికవి నన్నయ, ఆంధ్రా, కృష్ణా, రాయలసీమ, బీఆర్ అంబేద్కర్, శ్రీ కృష్ణదేవరాయ, విక్రమ సింహపురి, యోగి వేమన, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ, ద్రవిడియన్, శ్రీ వేంకటేశ్వర, పద్మావతి మహిళా వర్సిటీల పాలక మండళ్ల కాలపరిమితి పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.