గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం, రామిరెడ్డి నగర్ కు చెందిన సాయిలక్ష్మీ ఈ నెల 26న కుటుంబ సభ్యులతో బెంగళూరు వెళ్లారు. 29న బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూస్తే బీరువాకు తాళాలు వేసినట్లే ఉంది. అనుమానం వచ్చి తెరిచి చూస్తే బంగారు తాడు, రెండు జతలు చెవి దిద్దులు, ఇతర బంగారు వస్తువులు కనిపించలేదు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ హైమారావు తెలిపారు.