గుమ్మడి కాయలో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, మెగ్నీషియం, సోడియం, పీచు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి పోషకాహారం. ఇది రక్తంలో చేరిన మలినాలను బయటకు పంపుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది రక్తప్రసరణ సాఫీగా ఉండేలా చేస్తుంది. బీపీని నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.