జాతీయ రహదారుల శాఖ ఏప్రిల్ 1 నుంచి టోల్‌చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించడం అన్యాయమని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్( ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్) పేర్కొంది. వాహన యజమానులు, ప్రజలు మార్చి 31న మధ్యాహ్నం 12 నుంచి 12.10 గంటల వరకు(పది నిమిషాలు) ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి నిరసన తెలియజేయాలని పిలుపునిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్సు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, వ్యక్తిగత వాహనదారులు, పెద్ద వాహనాల డ్రైవర్లు 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గించాలని, ప్రతిపాదిత టోల్‌గేట్ ధరల పెంపును విరమించాలని ఆయన డిమాండ్ చేశారు.