వాదినాల చంద్ర ఓబులపతి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి కలిగిన గొప్ప హార్మోనిస్టు అని, అంత గొప్ప కళాకారుణ్ణి కోల్పోవడం కళారంగానికి తీరని లోటని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ప్రముఖ హార్మోనిస్టు, ఎందరో రంగస్థల కళాకారులను తీర్చిదిద్దిన గురువు వాదినాల చంద్ర ఓబులపతి సంస్మరణ సభను గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, చంద్ర ఓబులపతి మిత్రులు, శిష్యులు, సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి ముందుగా వాదినాల చంద్ర ఓబులపతి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ప్రముఖ రంగస్థల నటులు వలసిగాండ్ల సుబ్బరాయుడు, వి. ప్రకాశం, దాసరి సుధాకర్ లు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో చంద్ర ఓబులపతి శిష్యులు, ప్రముఖ రంగస్థల నటులు దేవరశెట్టి గంగయ్య, శ్రీనివాసరాజు, ఎ. ఓబులేసు, ఎం. మురళి, ఎల్. వీరన్న, పోలయ్య, భూమిరెడ్డి స్వరూపరాణి, సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, గ్రంథపాలకులు ఎన్. రమేశ్‌రావు, పాఠకులు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.