కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడిని ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురువారం కోరారు. రాయచోటి పట్టణంలోని ఎన్ జి ఓ కాలనీలోని రామాలయంలో శ్రీరామనవమి సంధర్బంగా నిర్వహించిన సీతారాముల కల్యాణం లో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు స్వాగతం పలికి ఎమ్మెల్యే చేత పూజలు గావింపచేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు, సంక్షోభాలు ఎదురయినప్పుడు వాటికి భయపడి పారిపోకుండా ఎలా విజయాలు సాధించవచ్చో శ్రీరాముడు లోకానికి చాటి చెప్పారన్నారు. జగత్తుకు కళ్యాణ సంస్కృతిని నేర్పిన జంట సీతారాముల జంట అని అన్నారు. శ్రీరాముని దయవల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.