ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విభజన హామీల నోడల్ ఏజెన్సీ అయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై దృష్టిసారించాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో రాత్రి సుమారు 40 నిమిషాల పాటు కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు.