వైసీపీ హయాంలో కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కౌలు రైతుల పతనానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైసిపి ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. రైతుల కష్టాలపై జనసేన పార్టీ త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుందన్నారు. ఈరోజు రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పవన్ని కలిశారు.