బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న వారు ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి.ఆదివాసీల బంద్కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.