తెలుగు రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే అని ఎదురు చూస్తున్న సికింద్రాబాద్- తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్ ల మధ్య తిరిగే వందే భారత్ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ర్తెళ్లు ఎట్టకేలకు వచ్చేశాయి. ఏప్రిల్ 8న శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో జరిగే వర్చువల్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలను లాంఛనంగా ప్రారంభిస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రారంభోత్సవ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 11: 30 గంటలకు బయలుదేరి నల్లగొండ మధ్యాహ్నం 1: 05/1: 10, మిర్యాలగూడ, 1: 40/1: 45, పిడుగురాళ్ల 2: 30/2: 35, గుంటూరు 3: 35/3: 45, తెనాలి సాయంత్రం 4: 15/4: 20, బాపట్ల 4: 50/4: 55, చీరాల చీరాల 5: 10/5: 15, ఒంగోలు 5: 50/5: 55, నెల్లూరు 6: 30/6: 35, గూడూరు 7: 35/7: 40, తిరుపతికి రాత్రి 9: 00 గంటలకు చేరుకుంటుంది.