పిడుగురాళ్ల: రైల్వే స్టేషన్ సమీపంలోని పొలాల్లో భవన నిర్మాణ కార్మికుడు కొండా ప్రభాకర్(35) గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా నర్సింగ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నాలుగేళ్ల నుంచి పిడుగురాళ్లలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కార్మికుడు పొలాల్లో పురుగుమందు త్రాగి మృతి చెందాడు.