గురజాల: ఆస్తి, నీటి పన్ను బకాయిలు వడ్డీ లేకుండా చెల్లించేందుకు శుక్రవారం చివరి రోజు అని నగర పంచాయతీ కమిషనర్ అన్నదాత మోహన శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ 89 శాతం పన్ను వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని గమనించి, మిగిలిన వారంతా తప్పనిసరిగా ఈరోజు పన్ను చెల్లించాలని కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa