ప్రతి ఒక్కరూ విద్యావంతులై కుటుంబాలకు, సమాజానికి ఉపయోగపడాలని కళాశాల ప్రిన్సిపల్ టి. చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్. వెంకటేశ్వరరెడ్డి కోరారు. గురువారం రాణి తిరుమల దేవి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంప్ లో భాగంగా గురువారం ప్రొద్దుటూరు మండల పరిధి మీనాపురం గ్రామంలో స్పెషల్ సర్వే ఆఫ్ యూత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉద్యోగం కోసమే కాకుండా జ్ఞాన సమాపార్జన చేస్తే స్వయం ఉపాధి అవకాశాలైనా పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa