కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రజానీకం మీద మోపుతున్న అన్ని రకాల భారాలను తక్షణమే ఆపాలని, లేనిపక్షంలో ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ హెచ్చరించారు. శుక్రవారం నాడు కడప నగరం పాత బస్టాండ్ వద్ద వున్న పూలే సెంటర్లో ఏప్రిల్ 1వ తేదీ నుండి వేస్తున్న భారాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కడప నగర కమిటీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకం మీద పెద్దఎత్తున భారాలు మోపుతూ అదానీ, అంబానీకి సంపదను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, అన్వేష్, నగర నాయకులు ఓబులేసు, పరుక్ హుస్సేన్, జమీల, మహబూబ్ తార, షకీలా, షంషాద్, రాజమణి, సరిత, లోక్‌సత్తా నాయకులు దేవర కృష్ణ, సీపీఎం నాయకులు వెంకట సుబ్బయ్య, ఓబులయ్య, వినోద్, శివ రియాజ్, తదితరులు పాల్గొన్నారు.