కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కేంద్ర న్యాయశాఖ మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కిరణ్ రిజిజు' ఒక యూజ్ లెస్ ఫెలో' అంటూ మండిపడ్డారు. రాహుల్ పై అనర్హత వేటు విషయంలో న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. దీనిపై యాక్షన్ ప్లాన్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అదానీ, మోదీ బందంపై రాహుల్ ప్రశ్నించడంతోనే ఆయన్ను టార్గెట్ చేశారని, రాహుల్ చెప్పేవన్నీ వాస్తవాలేనని తెలిపారు.