ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో శుక్రవారం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. నాగర్ కొత్వాలి ప్రాంతంలోని ధికోలి రోడ్డులో ఫ్యాక్టరీ నడుస్తున్న ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. పేలుడు సంభవించిన ఇల్లు కుప్పకూలిందని, శిథిలాల కింద మరికొంత మంది కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సిలిండర్ ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa