నాటు సారా, గంజాయి నిర్మూలనే మా లక్ష్యం అంటూ హడావుడి చేస్తున్న చీరాల పోలీసులు పట్టణంలోనే 'నాటుకు దారి' అంటూ బోర్డు పెట్టి మరీ సారాను విక్రయిస్తుండగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరాలలోని ఒక పేటలో ఈ బోర్డు అందరికీ కనిపిస్తుండగా పోలీసులు, సెబ్ అధికారుల దృష్టికి రాకపోవడం విచిత్రం అనిపిస్తోంది. స్థానిక పోలీసులను పక్కనపెడితే సారాను నిర్మూలించాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తున్నందువల్లే సారా తయారీదారులు, విక్రయదారులు ఈ లెవెల్లో రెచ్చిపోతున్నారన్నది సుస్పష్టం. ఇప్పటికైనా సెబ్ అధికారులు 'సోమ'రితనం వదిలించుకుంటారేమో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa