ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజంపేట యన్. యస్. యస్. విద్యార్థులకు ప్రత్యేక శిభిరం చివరి రోజైనా శుక్రవారం సర్టిఫికేట్ ల పంపిణీ చేశారు. యన్. యస్. యస్. కో ఆర్డినేటర్ డా. రాజమోహన్ రెడ్డి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పురుషోత్తమ్ మాట్లాడుతూ సమాజ సేవలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సామాజిక సేవ కూడా తమ బాధ్యతగా భావించాలని సూచించారు. సామాజిక సేవ విద్యార్థులలో సమాజం పట్ల బాధ్యతను పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యన్. టి. ఆర్. కాలనీలో సేవలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యన్. యస్. యస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట నరసయ్య, అధ్యాపక సిబ్బంది పి. శోభన్ బాబు, శివరామి రెడ్డి, వి. పార్వతి, బి. నాగరాజ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa