పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి బలవంతపు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయి, ఓ కుమార్తె కూడా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే......చిత్తూరు జిల్లా, గంగవరం మండలానికి చెందిన చలపతి(33) ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే 17 ఏళ్ల విద్యార్ధినితో చనువుగా ఉంటూ వచ్చాడు. మాయమాటలు చెప్పాడు. బుధవారం రోజున చివరి పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్లాడు. తాను నిజాయితీపరుడని, తనను నమ్మితే సంతోషంగా చూసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అక్కడే ఓ ఆలయంలో పెళ్లికూడా చేసుకున్నాడు. కొద్దిసేపటికి లెక్చరర్ చలపతి నిజస్వరూపాన్ని ఆమె గమనించారు. అతడి మాటలకు పొంతన లేకపోవడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గురువారం రాత్రి గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకొంది. లెక్చరర్ మాయమాటలు చెప్పి మోసంచేశాడని తల్లిదండ్రుల వద్ద విలపించింది. ఆ బాలికతోపాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లెక్చరరు చలపతిపై ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, నిందితుడికి అంతకుముందే పెళ్లయి, బిడ్డ కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa