విశాఖపట్నం పోర్టు ఏర్పాటై 90 ఏళ్లు అవుతున్న తరుణంలో గతంలో ఎన్నడూ లేనంతగా 7.37 కోట్ల టన్నుల సరుకును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని పోర్టు చైర్మన్ కే రామమోహన రావు వెల్లడించారు. 2023-23 ఆర్థిక సంవత్సరంలో కేవలం సరుకు రవాణా ద్వారానే రూ.1,700 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 6.9 కోట్ల టన్నుల సరుకు రవాణా చేయగా గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 7 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు చెప్పారు. రెండేళ్ల నుంచి ఖాళీగా వున్న వెస్ట్ క్యూ-6 బెర్తును కోర్టు ద్వారా వెనక్కి తీసుకొని నిర్వహణలోకి తీసుకురాగా 15 లక్షల టన్నుల సరుకు హ్యాండిల్ చేసి రూ.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa