భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కల్యాణం, పట్టాభిషేకం తిలకించిన భక్తులకు శనివారం సదస్యం పేరిట మరో ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం దక్కింది. నూతన జంట సీతారాముల వారికి వేదాలతో పండితులు ఆశీర్వచనం అందించారు. బహ్మోత్సవాల్లో భాగంగా 'సదస్యం' ఉత్సవాన్ని వైభవంగా కొనసాగించారు. సుప్రభాతం పలికి మంగళా శాసనం చేశారు. ప్రధాన ఆలయంలో బంగారు తులసీదళాల పూజ నిర్వహించారు. సాయంత్రం వేళ చతుర్వేదాలతో సీతారాముల వారికి బేడా మండపం వద్ద చేసిన సదస్యం సంబరంగా సాగింది. పారాయణాలతో భద్రగిరి భక్తగిరిగా మారింది.