ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు సంబంధించిన లోగోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. కాగా, భారత్ చివరిసారిగా 2011లో వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వగా, టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ భారత్ లో జరగనుండడంతో ఈ సారి కూడా కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.