గిరిజనులకు కల్పించిన 1/70 భూ బదలాయింపు చట్టాన్న ధిక్కరించి అరకులోయ మండలంలోని యండపల్లివలస గ్రామంలో ఓ గిరిజనేతరుడు అక్రమ కట్టడాల జోరు కొనసాగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే. పద్మాపురం పంచాయతీలోని యండపల్లివలస గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఓ గిరిజనేతరుడు శాశ్వత దుకాణాన్ని నిర్మించుకుంటున్న సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకున్న అధికారుల ఆదేశాలను బేఖతర్ చేస్తున్నాడు. యండపల్లివలసలోని రోడ్డు పక్కన ఓ గిరిజనేతరుడు కొంతమేర గేటు నిమిత్తం కొంతమేర స్థలాన్ని కబ్జా చేసాడు. అయితే రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవడంతో ఏ మాత్రం రెవిన్యూ ఆదేశాలను భేఖతర్ చేస్తూ శాశ్వత దుకాణ నిర్మాణ పనులు చేపడుతున్నాడు. దీనిపై సంబంధిత రెవెన్యూ సిబ్బంది స్పందించి పంచాయతీ అనుమతులతో శాశ్వత అక్రమ దుకాణ నిర్మాణ పనులు తొలగించాలని పలువురు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.