ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వచ్చారు. ఈ సందర్భంగా ఆలపాటి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై దాడి దారుణమన్నారు.