చండీగఢ్‌లోని పంజాబ్-హర్యానా సెక్రటేరియట్లో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ శవమై కనిపించాడు. సర్వీస్ రివాల్వర్ నుండి జవాన్‌కు తుపాకీ గాయాలు ఉన్నాయని చండీగఢ్ పోలీస్ PRO, DSP రాంగోపాల్ తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, జవాన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.ఘటనా స్థలం నుంచి బుల్లెట్ షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.