ఏపీలో నేటి నుండి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. నేటి నుండి 5 రోజుల పాటు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63,42,805 మంది లబ్ధిదారులకు రూ.1,747.88 కోట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.