గర్భిణీలు రోజూ కొన్ని జ్యూసెస్ తీసుకుంటే పుట్టే బిడ్డకు, వారికి చాలా ఆరోగ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో అవకాడో జ్యూస్ తాగితే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. కర్భూజ రసం తాగితే జీర్ణ సమస్యలు రావు. పుచ్చకాయ రసం, ట్రీ యాపిల్ జ్యూస్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాపిల్ జ్యూస్ లోని విటమిన్లు అలసట, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. దానిమ్మ జ్యూస్ తాగితే గర్భిణీల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది.