ప్రమాదవశాత్తూ ఓ బాలుడి మలద్వారంలోకి గునపం చొచ్చుకుపోయిన ఘటన ఒడిశాలోని కొంధమాల్ జిల్లాలో జరిగింది. సువర్ణగిరి ప్రాంతానికి చెందిన శక్తి పటగురు(16) తరగతి గదిపైకి ఎక్కి సిమెంట్ రేకులు తొలగిస్తుండగా కిందకు జారాడు. అదే సమయంలో అక్కడ ఓ కార్మికుడు గునపం పట్టుకొని నిల్చున్నాడు. దీంతో కిందపడుతున్న బాలుడి మలద్వారంలోకి గునపం చొచ్చుకుపోయింది. వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి గునపాన్ని బయటకు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa