గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన ఘటనపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనగర్ కు చెందిన జిక్కుల వెంకట కృష్ణకు విజయవాడకు చెందిన బొండాల గోపితో కొద్దికాలం కిందట పరిచయం అయ్యింది. గోపికృష్ణ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వెంకటకృష్ణ నుంచి పలు విడతలుగా రూ. 3, 90, 000 తీసుకున్నాడు. మోసపోయినట్లు గుర్తించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.