పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. పరీక్షల కోసం కందుకూరు పట్టణంలో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్య సిబ్బందిని అన్ని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. పరీక్ష జరిగే ప్రాంతాల్లో ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తును చేస్తున్నారు. ఉదయం 9: 30కి పరీక్ష ప్రారంభమవుతుండగా గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.