ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్ల వైసిపి పాలనలో నిరుద్యోగ యువత ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ రంగారావు ( బేబీ నాయన ) జగన్ సర్కార్ పై విడిచిపడ్డారు. ఆదివారం బొబ్బిలి కోటలో విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉపాధి ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి అనేకమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి కూడా చెప్పడం జరిగింది. గత టిడిపి హయాంలో రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, కానీ ప్రతి ఏటా మెగా డీఎస్సీ అన్న జగన్ రెడ్డి ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నాను. అధికారంలోకి రాగానే 2. 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతీ ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారని మీ అందరికీ ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేయటం మాని, వెంటనే తను అన్నమాట ప్రకారమే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఖాళీగా ఉన్న అన్ని శాఖల ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున కోరుతున్నాను.