గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఆధీనంలోని పాత భవనంలోని మొదటి అంతస్తులోని సెంట్రల్ క్లినికల్ లాబొరేటరీ గదిలో మంటలు చెలరేగాయి.మరోవైపు, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఎస్హెచ్ సిక్దర్ తెలిపారు.