గుంటూరు: వృద్ధిరాలిపై ఇంట్లో పని చేసే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పై సోమవారం పోలీసులు కేసు నమోదుచేశారు. విద్యానగర్లోని అభిరామ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో అక్కినేని వెంకటరమణయ్య, సౌజన్య దంపలు నివసిస్తున్నారు. వెంకటరమణయ్యకు పక్షవాతం రావడంతో సేవలందించేందుకు నూజివీడుకు చెందిన వెంకటేష్ ను పనిలో పెట్టుకున్నారు. అతని తీరు నచ్చాక ఆదివారం మంచి పని మానివేయాలని చెప్పారు. దీంతో వెంకటేష్ కత్తితో సౌజన్య పై దాడి చేసి మెడ, చేతుల మీద గాయపరిచాడు.