గుంటూరు: ఆర్మీ ఉద్యోగం మానేసి చైన్ స్కాచింగ్ కు పాల్పడుతున్న నిందితుడిని నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఊటు వంక గ్రామానికి చెందిన యువరాజు రెండేళ్లు ఆర్మీలో పనిచేసి చెడు వ్యసనాలకు బానిసై గొలుసుల చోరీకి దిగాడు. ఈ క్రమంలో గుంటూరు ఏటి అగ్రహానికి చెందిన దివ్య నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. సోమవారం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యువరాజును చాకచక్యంగా అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa