జిల్లా అధికారుల ఆదేశాలతో అప్పుడప్పుడు హడావుడిగా పంచాయతీ పరిధిలో గ్రీన్ పంచాయతీగా తీర్చిదిద్దాలంటూ పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతారు పంచాయతీ అధికారులు. ఆ తర్వాత కనీస పరిశుభ్రతను పాటించకపోవడంతో ప్రధాన రహదరిలలో పాటు నివాసాల మద్య చెత్తాచెదారాలు పేరుకుపోయి దోమలకు విషసర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఎర్రగొండపాలెంలోని పలు విధులతో పాటు త్రిపురాంతకం ప్రధాన రహదారి పక్కనే చెత్తాచెదానం పేరుకుపోవడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉప్పల్ తిప్పలుగా పడి ఉండటంతో దుర్వాసన వస్తుందని ఆ ప్రాంతవాసులు మంగళవారం తెలిపారు. కొంత పంచాయతీ అధికారం నిర్లక్ష్యం కొంత నివాసాలలో ఉండే వారి నిర్లక్ష్యం పొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.