ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు జీవి రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మాధవన్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవి రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ చూసిన నీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారని, వెయ్యి అడుగులు బోర్ వేసిన నీరు పడని పరిస్థితి ఏర్పడిందన్నారు.