ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ భాషకు చెందిన కోడిపుంజు అందాల పోటీల్లో మూడవ స్థానం దక్కించుకుంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో జరిగిన జాతీయస్థాయి చిలకముక్కు కోళ్ల అందాల పోటీలలో పుంజు మూడో స్థానం దక్కించుకుంది. నిర్వాహకులు పుంజు యజమాని సయ్యద్ భాషకు బహుమతులు ప్రధానం చేశారు.
అలానే ప్రశంస పత్రానికి కూడా అందించారు. జాతీయస్థాయిలో జరిగే ఈ పోటీలలో సుమారు ఐదు ఆరు రాష్ట్రాలకు చెందిన వారు తమ కోడిపుంజులతో పోటీలలో పాల్గొంటారు. ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం రాజుపాలెం గ్రామం నుండి పోటీలలో పాల్గొని సయ్యద్ భాష కోడిపుంజు బహుమతి గెలుచుకోవడం పై పలువురు అభినందిస్తున్నారు.