రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లి గ్రామనివాసి టీడీపి అసెంబ్లీ మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కాల్వ సంధ్య కుమార్తె "కాల్వ గాయత్రి" జన్మదిన వేడుకలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగాల్ రాయుడు సోమవారం పాల్గొన్నారు. ఆమెకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.