గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సెక్రటేరియట్ లో పనిచేస్తున్న పున్నయ్య అనే వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 11 లక్షలు తీసుకున్నాడని మంగళగిరి కి చెందిన గోపి గుంటూరు ఎస్పీ స్పందనలో సోమవారం ఫిర్యాదు చేశారు. పెరంబూర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందని గుర్తింపు కార్డు ఇచ్చాడని, అక్కడికి వెళ్తే అది నకిలీదని తేలిందన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నాడ ని, వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.