ఏప్రిల్ 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న మా భవిష్యత్ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం 14 రోజులపాటు కొనసాగుతుందన్నారు. 7లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ముఖ్యంగా ప్రజల్లో మా నమ్మకం జగనన్న అనే భావన రావాలని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలు ఉండాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa