నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఆవిష్కరణ చేసింది. అనంతపురం జిల్లాలో 15 విశిష్ట ఖనిజ లవణాలను గుర్తించారు. ఈ ఖనిజ లవణాలు ప్రజలు రోజూ వాడే సెల్ ఫోన్ల నుంచి టీవీల వరకు చాలా వాటిల్లో వినియోగిస్తున్నట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాలో అనేక చోట్ల సైనైట్ వంటి సంప్రదాయేతర శిలలపై పరిశోధనలు చేశారు. ఈ సందర్భంగా లాంతనైడ్ శ్రేణిలోని అనేక మూలకాలను, ఖనిజ లవణాలను కనుగొన్నారు.వీటిలో అలనైట్, సెరియేట్, థోరైట్, కొలంబైట్, టాంటలైట్, అపాటైట్, జిర్కాన్, మోనాజైట్, పైరోక్లోర్ యూజెనైట్, ఫ్లోరైట్ మరియు ఇతర ముఖ్యమైన ఖనిజ లవణాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa