పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మల్టీనేషనల్ రిటైల్ కార్పొరేషన్ సంస్థ వాల్‌మార్ట్ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అమెరికాలోని 5 ఇ-కామర్స్ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్స్‌లో పని చేస్తున్న సిబ్బందింలో ఉద్యోగాల కోతలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ లేఆఫ్స్ ద్వారా ఉద్యోగాలు కోల్పోపుతున్న వారికి కంపెనీలోని ఇతర విభాగాల్లో ఉద్యోగం పొందేందుకు అవకాశం కల్పిస్తాని రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో తెలిపింది వాల్‌మార్ట్. ఈ లేఆఫ్స్ ద్వారా సుమారు 2000 మందిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు.. వాల్‌మార్ట్ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా టెక్సాస్ లోని ఫోర్ట్ వార్త్‌లో ఉన్న గిడ్డంగిలో పని చేస్తున్న వారిలో సుమారు వెయ్యి మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని రాష్ట్ర కార్మిక విభాగం సోమవారం తెలిపింది. మల్టీనేషనల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఈ లేఆఫ్స్ పై కీలక విషయాలు వెల్లడించింది. పెన్సిల్వేనియాలోని ఫుల్‌ఫిల్మెంట్ లో 600 మంది, ఫ్లోరిడాలో 400 మంది, న్యూ జెర్సీలో 200 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. వీటితో పాటు కాలిఫోర్నియాలో సైతం ఉద్యోగాల కోతలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది.