తమ డిమాండ్ సాధన కోసం ఉద్యమ కార్యచరణను ప్రకటించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్దమవుతున్నాయి. ఇదిలావుంటే గత కొన్నాళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ల సాధన విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ప్రతినిధులతో పలు సమావేశాలు జరిపినప్పటికీ, ఇప్పటికీ సమస్యలు ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం 9 గంటలకు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నాయి. ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లపై రేపు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa