టీడీపీతోొ పొత్తుకు బీజేపీ ససేమీర అంటోంది. ఇలా అర్థమొచ్చేలా మరోసారి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ఉన్నాయని... వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలను పవన్ కలిసి మాట్లాడారంటే రెండు పార్టీల మధ్య ఎంత బలమైన బంధం ఉందో అర్థమవుతుందని చెప్పారు. పవన్ కల్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు. రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల నేతలను కలుస్తుంటామని... రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిశామని, అంతమాత్రాన టీడీపీతో పొత్తు ఉందని కాదని వీర్రాజు చెప్పారు. తమ పార్టీ నేత సత్యకుమార్ పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని అందరూ చూశారని, ఈ విషయంపై తమ పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉందని అన్నారు.