కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్ చెప్పింది. CRPFలో లక్షా 30 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనుంది. ఇందులో పురుషుల కోటాలో 1.25 లక్షల ఉద్యోగాలు, మహిళల కోటాలో 4667 ఉద్యోగాలున్నాయి. 18-23 ఏళ్లు ఉన్నవారి ఈ ఉద్యోగాలకు అర్హులు. అగ్నివీర్లకు 10% రిజర్వేషన్ ఉంటుంది.