కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మూలపల్లె గ్రామపంచాయతీలో బుధవారం గాలివీటి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని వారు తెలిపారు. ముఖ్యంగా థైరాయిడ్, షుగర్ బీపీ, లివర్ ఫంక్షన్ కిడ్నీ వ్యాధి పేషెంట్లు రక్త నమూనాలు స్వీకరించి, మందు బిళ్ళలు ఇవ్వడం జరిగింది గ్రామపంచాయతీలో మొత్త 210 మంది పేషెంట్లు వైద్య శిబిరానికి వచ్చి రక్త నమూనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో వైద్యుడు సంపత్ మాట్లాడుతూ సిద్ధవటం మండలం మూలపల్లె గ్రామపంచాయతీలో మాజీ సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మూలపల్లె గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. దాదాపు 2000 రూపాయలు ఖరీదైన రక్తన మూలాలు ఉచితంగా పరీక్షలు చేశామని వ్యాధులు బట్టి మందు బిళ్ళలు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏమైనా సమస్య ఉంటే కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచితంగా ఓపి చూస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.